తాజాగా ఇద్దరు యువతులు నడిరోడ్డుపై విచక్షణా రహితంగా కొట్టుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.ఈ ఇద్దరు యువతులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ సిటీకి చెందిన వారు.
అయితే వీరు ఒకే అబ్బాయిని ప్రేమించారు.ఈ విషయంలోనే ఇద్దరి మధ్య చాలా కాలంగా మాటల యుద్ధం నడిచింది.
అయితే తాజాగా వీరిద్దరూ తమ బ్యాచ్‌తో కలిసి నడిరోడ్డుపై సిగ్గులేకుండా కొట్లాడుకున్నారు.ఈ హింసాత్మక ఘర్షణకు దిగిన వీడియో వైరల్ అయ్యింది.
ఈ ఘటన గురించి అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు.
వైరల్ వీడియోలో కొంతమంది యువతులు ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం, ఒకరి జుట్టు మరొకరు లాగడం చూడవచ్చు.
వారి గొడవకు కారణం వారి ప్రేమికుడు అని స్థానిక మీడియా తెలిపింది.ఆ దారినే వెళ్తున్న కొందరు స్థానికులు ఈ అమ్మాయిలు పిచ్చిగా దెబ్బలాడుకుంటున్న దృశ్యాలను వీడియో తీశారు.
ఒక యువతి కర్ర తీసుకుని మరీ ఇంకో యువతిని చితక్కొట్టింది.ఈ గొడవలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకుంటుండగా, మరికొందరు అమ్మాయిలు తమ స్నేహితులకు మద్దతుగా నిలుస్తూ వారితో కలిసి గొడవకు దిగారు.
నివేదికల ప్రకారం, ఈ ఇద్దరు అమ్మాయిలు తమ ఫ్రెండ్స్ తో కలిసి బార్‌కు వచ్చారు.ఆ సమయంలోనే ఇద్దరి మధ్య బాయ్‌ఫ్రెండ్ గురించి వాగ్వాదం జరిగింది.
మాటకు మాట పెరగడంతో ఫిజికల్ అటాక్‌కి దిగారు.గొడవ గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరు యువతులను, వారి స్నేహితులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వీరందరూ బాగా మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలుసుకున్నారు.అయితే ఈ అమ్మాయిలు పోలీసులకు క్షమాపణలు చెప్పారని స్థానిక మీడియా తెలిపింది.
ఆ తర్వాత పోలీసుల సమక్షంలో ఈ ఇద్దరు అమ్మాయిలు తమ మధ్య కోపతాపాలను మాని బుద్ధిగా ఉంటామని చెప్పారు.దాంతో పోలీసులు అందరినీ విడిచిపెట్టారని తెలిసింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.“వాడు నా వాడే.కాదు నా వాడే అంటూ నడిరోడ్డుపై అమ్మాయిలు కొట్టుకోవడం సిగ్గు చేటు” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.అమ్మాయిలు ఎలాంటి దారిలో వెళ్తున్నారో చూస్తుంటేనే చాలా భయంగా ఉందని మరొకరు కామెంట్ పెట్టారు.
మద్యం తాగే అమ్మాయిలు తమ భవిష్యత్తును ఇలా నాశనం చేసుకోవడం చూస్తుంటే చాలా బాధగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.