జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత కిరాక్ ఆర్పీ మల్లెమాల వారి గురించి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఆర్పీ పలువురు జబర్దస్త్ కమెడియన్స్ స్పందిస్తూ అతను చేసే వ్యాఖ్యలను ఖండించారు.
ఇకపోతే ఇంటర్వ్యూలో భాగంగా షేకింగ్ శేషు అర్పీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఆర్పీ హోమ్ టూర్ వీడియోలో చేసిన ఇల్లు తనది కాదు అంటూ చెప్పడమే కాకుండా ఇంకా ఆర్పీ సినిమా మొదలు పెట్టుకుంటానే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాడంటూ తన గురించి విమర్శించారు.
ఈ క్రమంలోనే షేకింగ్ శేషు చేసిన ఈ వ్యాఖ్యలపై మరోసారి ఆర్పీ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేకింగ్ శేషు భార్య కూతురు గురించి దారుణమైన కామెంట్లు చేశారు.
ఇకపోతే కథ నచ్చడంతో అరుణాచలం గారు ఈ సినిమాని నిర్మిస్తానని చెప్పారు.ఈ క్రమంలోనే నాగబాబుగారు, చక్రవర్తి గారు నన్ను ప్రోత్సహిస్తూ ఈ సినిమా బాగా రావాలని ఆశీర్వదించారు.
అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది.ఒక సినిమా ప్రారంభించిన తర్వాత ఆఫీస్ కంపల్సరిగా ఉండాలి ఆఫీస్ లేకపోతే సినిమా వ్యవహారాలు ఎక్కడ చూసుకోవాలి అందుకోసమే డబ్బు ఖర్చయింది.
ఒకవేళ ఆఫీసు లేకపోతే సినిమా వ్యవహారాలన్నీ షేకింగ్ శేషు ఇంట్లో చూసుకోవాలా అంటూ ఆర్పీ షేకింగ్ శేషు పై దారుణంగా విమర్శలు చేశారు.ఆయన ఇల్లు తనకు ఆఫీస్ గా ఇచ్చి అతని భార్యను ఆఫీస్ బాయ్ గా తన కూతురును పాల ప్యాకెట్లను వేయమనండి అంటూ షేకింగ్ శేషు ఫ్యామిలీ గురించి ఆర్పీ షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే కొందరు ఆర్పీ ఈ విధంగా శేషు ఫ్యామిలీ గురించి మాట్లాడటం పూర్తిగా తప్పు అంటూ ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.
మరి ఈ వ్యాఖ్యలపై షేకింగ్ శేషు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.