సాధారణంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేవారు నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ పేరుకు మాత్రమే పైకి అలా చెబుతున్న పెద్ద ఎత్తున డబ్బు సంపాదించడానికి ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు.ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ పెద్ద ఎత్తున ఆస్తులను పోగు చేస్తుంటారు.
ముఖ్యంగా హీరోయిన్లు అయితే రెమ్యూనరేషన్ విషయంలో ఎంతో కచ్చితంగా ఉండటమే కాకుండా, వారికి అవకాశాలు ఉన్నప్పుడే పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటూ లైఫ్ లో సెటిల్ అవుతారు.ఎందుకంటే హీరోయిన్లకు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం మనుగడ ఉండదు కనుక అవకాశాలు ఉన్నప్పుడే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు.
ఇకపోతే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓవెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం అమ్మగా ప్రమోట్ కావడంతో ఈమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు.అయితే కాజల్ అగర్వాల్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇంటిలో కూర్చుని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
ఈమె ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఎన్నో రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వాటిని సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తూ కోట్లు వెనకేసుకున్నారు.ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ప్రముఖ ప్రెగ్నెంట్ కిట్ కంపెనీకి ప్రమోటర్ గా పనిచేశారు.
ఇక తనకు బాబు పుట్టిన తర్వాత ప్రముఖ డైపర్ కంపెనీని కాజల్ అగర్వాల్ ప్రమోట్ చేశారు.ఇదిలా ఉండగా తాజాగా మరొక బ్రాండ్ ప్రమోట్ చేస్తూ ఈమె సోషల్ మీడియాలో సందడి చేశారు.ప్రెగ్నెన్సీ తర్వాత అమ్మాయిల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి.ముఖ్యంగా శరీరం త్వరగా డ్రై అవుతుందని ఇలా మన శరీరం డ్రై కాకుండా,ఎప్పుడు హైడ్రేట్ గా ఉండడానికి సంబంధించిన ఒక ప్రోడక్ట్ గురించి ఈమె పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు.
ఈ విధంగా పలు బ్రాండ్లను కాజల్ అగర్వాల్ ప్రమోట్ చేస్తూ భారీ మొత్తంలో డబ్బును సంపాదిస్తున్నారు.ఏది ఏమైనా కాజల్ అగర్వాల్ మాత్రం సినిమాలలో నటించకపోయినా పక్కా కమర్షియల్ గా ఆలోచిస్తూ ఇలా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పాలి.