సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా, హరికృష్ణ కొడుకుగా, జూనియర్ ఎన్టీఆర్ సోదరుడిగా కళ్యాణ్ రామ్ కు ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.ఈ గుర్తింపుతో పాటు నటుడిగా, నిర్మాతగా కళ్యాణ్ రామ్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార థియేటర్లలో విడుదల కావడానికి కేవలం నెలరోజుల సమయం మాత్రమే ఉంది.తాజాగా బింబిసార ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ ట్రైలర్ కు దాదాపుగా 10 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.అయితే ట్రైలర్ లాంఛ్ సందర్భంగా కళ్యాణ్ రామ్ మీడియాతో ముచ్చటించగా ఒక ప్రశ్నకు సమాధానంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఈ సినిమాను పూర్తిగా పౌరాణికంగా చేయాలని అనుకుంటే ఇటీవల బాహుబలి వచ్చిందని అన్నారు.
బాహుబలి జానపద చిత్రం అనే సంగతి తెలిసిందే.సాధారణ ప్రేక్షకులకు సైతం ఈ విషయం తెలుసు.మరి కళ్యాణ్ రామ్ కు ఈ విషయం కూడా తెలియదా అంటూ నెటిజన్లు అయనను ట్రోల్ చేస్తున్నారు.
నెగిటివ్ కామెంట్ల గురించి కళ్యాణ్ రామ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లు సాధించాలని స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సినిమాసినిమాకు హీరోగా కళ్యాణ్ రామ్ రేంజ్ పెరుగుతోందనే సంగతి తెలిసిందే.కళ్యాణ్ రామ్ పలు ప్రయోగాత్మక సినిమాలలో నటించగా ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కళ్యాణ్ రామ్ సినిమాలలో మెజారిటీ సినిమాలు సొంత బ్యానర్ లోనే తెరకెక్కుతున్నాయి.కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్, బాలయ్యతో కలిసి నటించాలని ఆశ పడుతున్నారు.