తెలుగు ప్రేక్షకులకు నందమూరి బాలయ్య ను ఆహా ఓటీటీ అన్ స్టాపబుల్ తో విభిన్నంగా చూపించిన విషయం తెల్సిందే.సినిమా సినిమా కు తన స్టార్ డమ్ ను పెంచుకుంటూ కెరీర్ లో టాప్ స్టార్ గా నిలిచిన బాలయ్య గత కొన్నాళ్లు గా హీరోగా నిరాశ పర్చుతున్నాడు అనుకుంటున్న సమయంలో అన్ స్టాపబుల్ తో ఒక్క సారిగా స్వింగ్ బ్యాక్ అన్నట్లుగా బాలయ్య టర్న్ అయ్యాడు.
అద్బుతంగా ఆయన సినిమా వచ్చింది అనుకున్న రోజుల నుండి ఆయన ఎపిసోడ్ అదిరి పోయింది అన్నట్లుగా టాక్ షో ను నిర్వహించాడు. అల్లు అరవింద్ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా బాలయ్య అన్ స్టాపబుల్ అనిపించాడు.
ఇప్పుడు అన్ స్టాపబుల్ రెండవ సీజన్ కు వేళ్ల అయ్యింది అంటూ ఇటీవలే ఆహా టీమ్ ప్రకటించిన విషయం తెల్సిందే.స్వయంగా అధికారికంగా ఆహా టీమ్ నుండి క్లారిటీ రావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అధికారిక ప్రకటన వచ్చి నెల అవుతున్నా కూడా ఇంకా ఎలాంటి హడావుడి లేకపోవడంతో అభిమానుల్లో మళ్లీ చర్చ మొదలు అయ్యింది.రెండవ సీజన్ కు సంబంధించిన ఎపిసోడ్స్ చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభం అవ్వబోతుంది అంటే క్లారిటీ లేదు.
కాని అతి త్వరలోనే అన్ స్టాపబుల్ షో సీజన్ 2 కోసం రెండు ప్రోమోలను ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో షూట్ చేయబోతున్నారు.ఆ ప్రోమోలు వచ్చిన తర్వాత కొన్నాళ్లకు షో షురూ అయ్యే అవకాశం ఉంది.
బాలయ్య గోపీచంద్ సినిమా విడుదల సమయంకు అన్ స్టాపబుల్ సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతూ ఉండాలి అనేది బాలయ్య ప్లాన్ గా తెలుస్తోంది.తన సినిమా ప్రమోషన్ ను కూడా అన్ స్టాపబుల్ లో గతంలో మాదిరిగా అఖండకు చేసినట్లుగా చేయాలని బాలయ్య భావిస్తున్నాడట.
మంచి ఆలోచన అన్నట్లుగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.