ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సూపర్ హిట్ దక్కించుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కాడు అనుకుంటున్న సమయంలో రెడ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చాడు.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
ఏమాత్రం ఆ సినిమా జనాలను ఆకట్టుకోలేక పోయింది.పైగా కరోనా సమయంలో రావడం వల్ల జనాలు ఆ సినిమా గురించి కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇండస్ట్రీ లో రామ్ కు ఉన్న పేరు కాస్త ఆ సినిమా తో పోయింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రస్తుతం రామ్ ది వారియర్ సినిమా ను చేస్తున్నాడు.
విడుదలకు సిద్దం అయిన ది వారియర్ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు.
ది వారియర్ విడుదల అయిన వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వం లో సినిమా ను రామ్ మొదలు పెట్టబోతున్నాడు.
ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రామ్ త్వరలోనే ఆ సినిమా రెగ్యులర్ షూట్ లో జాయిన్ అవ్వబోతున్నాడు.
ఇన్ని వరుస సినిమాలతో బిజీగా ఉన్న రామ్ మరో వైపు గౌతం వాసు దేవ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు గాను ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి. గౌతమ్ మీనన్ కు తెలుగు లో మంచి క్రేజ్ ఉంది.
ఆయన తమిళ దర్శకుడు అవ్వడం వల్ల ద్వి భాష చిత్రంగా ఆ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.మొత్తానికి బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు రామ్ బ్యాక్ టు బ్యాక్ సినిమా లతో రాబోతున్నాడు.
మరి ఆ సినిమా లు ఎంత వరకు సక్సెస్ అవుతాయి అనేది చూడాలి.