మధ్య ప్రదేశ్ లో ఓ వివాహితను పాము కాటేసింది.అయితే విషయం గుర్తించిన ఆమె భర్త వెంటనే పాము పట్టుకొని బంధించాడు.
అంతే కాకుండా భార్యతో పాటే ఆ పామును కూడా ఆసుపత్రికి తీసుకెళ్లాడు.పామును ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లాడనే అనుమానం వస్తోందా.
అదే అనుమానం అక్కడి వైద్యులకు కూడా వచ్చింది.దాంతో ఏంటి విషయం అని ఆ వ్యక్తిని అడగడంతో అతను చెప్పిన సమాధానం విని షాకయ్యారు.
అయితే అతను అలా ఎందుకు చేశాడు, వైద్యులకు ఆయన చెప్పిన సమాధానం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్య ప్రదేశ్ ఉన్నావ్ లోని అఫ్జల్ నగర్ లో నివాసం ఉంటున్నరామేంద్ర యాదవ్ భార్యకు గురువారం పాము కరిచింది.
ఇంట్లో పనులు చేసుకుంటుండగానే ఇలా జరగడంతో విపరీతమైన కేకలు వేసింది.అది విన్న భర్త వెంటనే అక్కడకు వచ్చి పామును పట్టుకున్నాడు.దాన్ని ఓ బాటిల్ లో బంధించాడు.సీసాలోని పాము చావకుండా గాలి లోపలికి వెల్లేలా బాటిల్ కు రంద్రాలు కూడా చేశాడు.
ఆ తర్వాత భార్యతో పాటు పామును కూడా ఆస్పత్రికి తీసుకెళ్లాడు.ఇదెందుకు తెచ్చావని వైద్యులు అడగ్గా.
ప్రతి సారి పాము కాటేసినప్పుడు.ఏ పాము అని అడుగుతారు.
అందుకే ఈ సారి పామునే వెంటబెట్టుకొని వచ్చానని చెప్పాడు.దీంతో వైద్యులు షాకయ్యారు.
భార్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుసుకున్న అనంతరం ఆ పామును అడవిలో వదిలేశాడు.