తెలుగు సినిమా పరిశ్రమలో నేటి నుండి షూటింగ్ లు జరగవు.నేడు అన్ని క్రాప్ట్ ల వారు.
అన్ని సంఘాల వారు సమ్మెకు సిద్దం అయ్యారు అంటూ నిన్న ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.అయితే నేడు చాలా వరకు షూటింగ్ లు యధావిధిగా జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
కొందరు స్టార్స్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా నేడు షూటింగ్ కు హాజరు అవుతున్నాం అంటూ చెప్పకనే చెబుతున్నారు.షూటింగ్ లకు ఎలాంటి ఇబ్బంది లేదు.
అన్ని కూడా సజావుగా సాగుతున్నాయి అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.మరి నిన్న వచ్చిన ప్రకటన దేని గురించి అనేది చాలా మంది అభిప్రాయం.
అసలు విషయం ఏంటీ అంటే సినిమా ఇండస్ట్రీ లోని అన్ని క్రాప్ట్ ల వారు కూడా వేరు వేరు యూనియన్స్ లో ఉన్నారు.కొన్ని యూనియన్స్ లో ఉన్న వారు తమకు వస్తున్న పారితోషికం విషయంలో సంతృప్తి గా ఉన్నారు.
అందుకే వారు ఈ సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధం గా లేరని తెలుస్తోంది.అంతే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో నిర్మాతలను ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు అనేది అందరి అభిప్రాయం.
అందుకే మెజార్టీ శాతం వరకు షూటింగ్ లకు హాజరు అయ్యేందుకు ఆసక్తి చూపించారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.ప్రస్తుతం షూటింగ్ ను నిర్వహిస్తున్న సినిమా నిర్మాతలకు ఇబ్బంది కలుగకుండా పారితోషికం పెంపు విషయం లో చర్చ లు జరుపుకోవాలని సూచిస్తున్నారు.ఒక్కో సినిమా కు రోజుకు లక్షల్లో ఖర్చు అవుతూ ఉంటుంది.ఉన్నట్లుండి డేట్లు రద్దు చేసుకుంటే నిర్మాతలు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.అందుకే సమ్మె విషయం లో నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడి విభేదించుకుని షూటింగ్ లకు కొందరు హాజరు అవుతున్నారు.