అయ్య బాబోయ్.. రష్మిక ఇన్ని సినిమాలకు నో చెప్పిందా?

చలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన చల్ చలో చలో అంటూ ప్రస్తుతం కెరీర్ లో దూసుకుపోతుంది.వరుస అవకాశాలు అందుకుంటూ తనకు తిరుగు లేదు అని నిరూపిస్తుంది.

 Rashmika Mandanna Rejected Movies Acharya Jersey Bangarraju Rc15 Details, Rashmi-TeluguStop.com

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది.

ఇక ఇప్పటి వరకు ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అయిందని చెప్పాలి.ఇదిలా ఉంటే అటు రష్మిక తన కెరీర్లో ఎన్నో సినిమాలను వదిలేసిందట.

ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమాలో పూజా హెగ్డే పాత్రలో రష్మిక మందన అనుకున్నారట.

కానీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో రష్మిక ఈ పాత్రకు నో చెప్పేసిందట.కానీ రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చిన కారణంగానే పూజాహెగ్డే సినిమా చేసినట్టు టాక్ వుంది.

రష్మిక హీరోయిన్ గా మారిన కిరిక్ పార్టీ మూవీ అదే టైటిల్ తో హిందీలో రీమేక్ చేస్తుండగా ఈ సినిమాలో నటించేందుకు రష్మిక నో చెప్పడంతో కృతిసనన్ తీసుకున్నారు.నాని నటించిన జెర్సీ సినిమా హిందీలో అదే టైటిల్ తో రీమేక్ చేయగా ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా రష్మిక ను అనుకున్నారట.

కానీ రష్మికా నో చెప్పడంతో చివరికి మృణాల్ సేన్ ని తీసుకున్నారు.

Telugu Achrya, Bangarraju, Beast, Jersey, Kirrak, Mahasamudram, Pooja Hegde, Ras

ఇళయ దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో కూడా పూజా హెగ్డే కి బదులు రష్మిక ను అనుకున్నారట.కానీ కథ నచ్చక నో చెప్పిందట రష్మిక మందన.దీంతో పూజా హెగ్డే ఈ ఆఫర్ దక్కించుకుంది.

ఇక నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమాలో రష్మిక అయితే బాగుంటుందని అనుకున్నారట మేకర్స్.కానీ ఈ అమ్మడు నో చెప్పడంతో చివరికి నజ్రియాను తీసుకున్నారు.

Telugu Achrya, Bangarraju, Beast, Jersey, Kirrak, Mahasamudram, Pooja Hegde, Ras

ఈ సంక్రాంతికీ సూపర్ హిట్ సాధించిన బంగార్రాజు సినిమాలో కృతి శెట్టి నటించిన పాత్ర కోసం రష్మిక ను తీసుకోవాలి అనుకున్నారు.కానీ అది కుదరలేదు.వీటితో పాటు రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ మూవీ శర్వానంద్ మహాసముద్రం సహా అటు బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి లాంటి పలువురు దర్శకులు ఇచ్చిన ఆఫర్లు కూడా రష్మికా నో చెప్పిందట.దీన్ని బట్టి చూస్తే రష్మీక తన కెరీర్ను ఎంత పక్కాగా ప్లాన్ చేసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube