తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ కి స్పెషల్ గుర్తింపు ఉంది.అసలు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కెరీర్ స్టార్ చేసి అందరి చేత మన్ననలు పొంది మెగాస్టార్ గా మారిపోయాడు చిరంజీవి.
ఈయన ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు.అయితే చిరంజీవి హీరోగా నిలదొక్కు కున్న తర్వాత ఈయన పేరు చెప్పుకుని ఆయన కుటుంబ సభ్యులు చాలా మంది సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.
మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికి దాదాపు 10 మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.మెగాస్టార్ వారసుడుగా రామ్ చరణ్ తేజ్ కూడా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి వరుస విజయాలు అందుకుంటూ సినిమా సినిమాకు నటన పరంగా కూడా బెస్ట్ ఇస్తున్నాడు.
చిరంజీవి ని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీ లోకి చాలా మంది వచ్చారు.ఇక మెగా ఫ్యామిలీ అయితే చిరు పేరు చెప్పుకునే బ్రతుకుతుంది.
అయితే వచ్చిన వాళ్లందరిలో కొద్దీ మంది మాత్రమే క్లిక్ అయ్యారు.మరి కొంత మంది మాత్రం సెటిల్ కాలేక పోయారు.
గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీలో సరైన హిట్ లేదు.పవన్ కళ్యాణ్ కు కూడా భీమ్లా నాయక్ తో హిట్ వచ్చిన అది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయ్యింది.
ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవ్వలేదు.
ఇక రీసెంట్ గా వచ్చిన ఆచార్య సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఈ సినిమా అట్టర్ ప్లాప్ లోనే చరిత్ర తిరగ రాసింది.ఇంత ఘోరమైన కలెక్షన్స్ ఇంత వరకు చిరంజీవి సినిమాకు రాలేదనే చెప్పాలి.
మెగా సినిమాలంటే ఒక మార్క్ ఉండేది.కానీ రాను రాను ఇప్పుడు ఆ ట్యాగ్ అనేది పోతుంది.
అస్సలు మెగా హీరోల సినిమాలు ఇలా వరుసగా ప్లాప్ అవ్వడానికి కారణం ఏంటా అని అంతా ఆరా తీసున్నారు.ఈ క్రమంలోనే సంచలన నిజాలు బయటకు వచ్చాయి.మెగా హీరోలు ఒకప్పుడు కథ ను చూసే వారని.తమ పాత్ర గురించిన ప్రాధాన్యం చేసేవారు అని.కానీ ఇప్పుడు మాత్రం కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే చూస్తూ ముందుకు వెళ్లడంతో వీరి సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయని అంటున్నారు.మరి ముందు ముందు అయినా మెగా హీరోలు తమ తప్పులను తెలుసుకుని సినిమాలు హిట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారేమో చూడాలి.