కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజిఎఫ్ సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో అందరికి తెలుసు.కెజిఎఫ్ చాప్టర్ 1 భారీ హిట్ అందుకోవడంతో చాప్టర్ 2 కూడా తెరకెక్కించి ఇటీవలే రిలీజ్ చెయ్యగా అది పార్ట్ 1 కంటే భారీ స్థాయిలో విజయం సాధించింది.
ఈ సినిమాలో హీరోగా నటించిన యష్ సూపర్ స్టార్ గా ఎదిగాడు.రాఖీ బాయ్ గా ఈయన సృష్టించిన వీరంగం గురించి అందరికి తెలుసు.
ఒక్క సినిమాతో ఈయన కన్నడ నాట సంచలనం సృష్టించాడు.ఇక పార్ట్ 2 తో ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించాడు.ఈయన అంటే ఎనలేని క్రేజ్ ఏర్పడడంతో అభిమానులు సైతం మరింత అభిమానం పెంచుకుంటున్నారు.రాకింగ్ స్టార్ తో పాటు యష్ ను స్టైలిస్ట్ స్టార్ అని కూడా సంబోధిస్తూ ఉంటారు.
కేజిఎఫ్ కారణంగా ఈయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
అయితే ఇప్పటి వరకు యష్ సాధారణంగా ధరించే దుస్తులు, హెయిర్ స్టైల్ పై మాత్రమే మాట్లాడుకున్నారు.
వారి గురించి ప్రేక్షకులకు కూడా తెలిసింది.కానీ తాజాగా యష్ షేర్ చేసిన ఒక వీడియోలో ఫ్యాన్స్ తో తన షూ కలెక్షన్ గురించి చర్చకు వచ్చింది.ఈ వార్త ఇప్పుడు నెట్టింట ఇంట్రెస్ట్ గా మారింది.ఈయన షేర్ చేసిన వీడియోలో పదుల సంఖ్యలో షూలు కనిపిస్తున్నాయి.వీటిని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్య పోతున్నారు.
ఈయన దగ్గర ఒక వంద రకాల షూ కలెక్షన్ ఉండవచ్చని అంటున్నారు.ఈ ఒక్కొక్క షూ ధర 5 వేలకు పైగానే ఉంటుంది.ఇలా ఈయన షూలు మొత్తం కలిపితే లక్షల్లోనే ఉంటాయి.
ఇలా ఈ వీడియో చూసిన తర్వాత ఫ్యాన్స్ ఈయనను రాక్ స్టార్ అని మాత్రమే కాకుండా స్టైలిష్ స్టార్ అని కూడా పిలుచు కుంటున్నారు.ఈయన కేజిఎఫ్ 2 హిట్ అయినా ఆనందంలో ప్రెసెంట్ తన సమయాన్ని స్నేహితులతో కుటుంబ సభ్యులతో గడుపు తున్నాడు.
తన తర్వాత సినిమా గురించి త్వరలోనే అప్డేట్ రానుంది.