మంచు వారి సన్నాఫ్ ఇండియా ఓటీటీ ఉందా? లేదా?

మంచు మోహన్‌ బాబు చాలా కాలం తర్వాత లీడ్ రోల్‌ లో నటించిన సన్నాఫ్ ఇండియా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ బడ్జెట్‌ తో ఈ సినిమా ను మంచు విష్ణు నిర్మించాడు.

 Manchu Film Son Of India Ott Streaming Update , Manchu Vishnu , Mohan Babu ,-TeluguStop.com

వీఎఫ్ఎక్స్‌ కు భారీ గా ఖర్చు చేశాం అని.ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఒక కళా కండం అంటూ యూనిట్‌ సభ్యులు ముఖ్యంగా మంచు విష్ణు మరియు మోహన్ బాబు పదే పదే చెప్పారు.దానికి తోడు ఈ సినిమా లో చిరంజీవి వాయిస్ ఓవర్‌ ఇవ్వడం వల్ల కూడా అంచనాలు భారీ గా పెరిగాయి.అంచనాలు ఏమాత్రం ఈ సినిమా అందుకోలేక పోయింది.దానికి తోడు ఆ మద్య మోహన్ బాబు మరియు మంచు విష్ణు లు చేసిన హడావుడి కారనంగా సినిమా కు దారుణమైన ట్రోల్స్ వచ్చాయి.50 కోట్లు వసూళ్లు చేస్తుందన్న సినిమా కనీసం ఒక్క కోటి కాదు కదా కనీసం 50 లక్షల షేర్‌ ను రాబట్టలేక పోయింది.

మోహన్‌ బాబు కెరీర్‌ లో ఇలాంటి ఒక దారుణమైన ప్లాప్‌ పడుతుందని ఏ ఒక్కరు ఊహించలేదు.ఇలాంటి దారుణాన్ని చూడటం కోసమా ఉన్నది అంటూ అభిమానులు నెత్తి నోరు కొట్టుకున్నారు.

సరే థియేటర్లలో సినిమా ఎలాగూ ఆడలేదు.కనీసం ఓటీటీ లో అయినా సినిమా ఆడుతుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఆడటం ఏమో కాని అసలు ఓటీటీ లో వచ్చే పరిస్థితి లేదు.సినిమా ను భారీ బడ్జెట్‌ తో నిర్మించడం వల్ల భారీ మొత్తానికి ఈ సినిమాను అమ్ముతాము అంటూ మంచు విష్ణు భీష్మించుకు కూర్చున్నాడు.

దాంతో సినిమా ఓటీటీ విడుదల విషయంలో అనుమానాలు ఉన్నాయి.ఇప్పటి వరకు సన్నాఫ్ ఇండియా ఓటీటీ స్ట్రీమింగ్ లేదు.

ముందు ముందు ఉంటుందా లేదా అనే విషయం లో క్లారిటీ లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube