బార్‌లోకి వెళ్లేందుకు.. వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా అబద్ధం: భారత సంతతి వృద్దుడికి జైలుశిక్ష

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి బీభత్సం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే.తగ్గినట్లే తగ్గే.

 Indian-origin Senior Citizen In Singapore Lies On Vaccination Status To Enter Ba-TeluguStop.com

కొత్త కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతూ.మానవాళిని ముప్పు ముంగిట నిలబెడుతోంది.

ప్రస్తుతం ఒమిక్రాన్ ఉపరకాల కారణంగా కల్లోల పరిస్ధితులు నెలకొన్నాయి.ముఖ్యంగా చైనా, హాంకాంగ్, యూరప్ ఖండం వైరస్ ధాటికి వణికిపోతోంది.

రోజుకు లక్షలాది కేసులు వెలుగుచూస్తుండటంతో ప్రభుత్వాలు తలపట్టుకుంటున్నాయి.అటు మనదేశంలోనూ రోజువారీ కేసులు పెరుగుతున్నాయి.

ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ఒక్కటే కోవిడ్‌పై పోరాడేందుకు ఆయుధమని నిపుణులు చెబుతున్నారు.కొందరు బాధ్యత గల పౌరులు తమకు తాము వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.

కానీ కొందరు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.ఈ భూమ్మీద ఇప్పటికీ టీకా తీసుకోని వారు కోట్లలో వున్నారు.

కాగా.కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధిస్తూ.అవసరమైతే జైళ్లకు కూడా పంపుతోంది సింగపూర్.ఇలాంటి ఘటనల్లో దోషులుగా భారతీయులు కూడా వుండటం దురదృష్టకరం.

తాజాగా వ్యాక్సిన్ తీసుకోకుండా తీసుకున్నట్లు అబద్ధం చెప్పిన భారత సంతతి వ్యక్తికి కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది.ఉతేయ కుమార్ నల్లతంబి (65) అనే వ్యక్తి బార్‌లోకి ప్రవేశించేందుకు గాను ట్రేస్ టు గెదర్ యాప్‌ ద్వారా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిలా నటించి మోసం చేశాడు.

గతేడాది సెప్టెంబర్ 9న తాను, తన స్నేహితురాలితో కలిసి ఉతేయ కుమార్‌ను కలిశానని.డ్రింక్స్ కోసం ఐలాండ్ రిసార్ట్ సెంటోసాలోని బికినీ బార్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు మరో నిందితుడు కిరణ్ సింగ్ రుగ్బీర్ సింగ్ తెలిపాడు.

అయితే అప్పటికీ టీకా తీసుకోకపోవడంతో బార్ అసిస్టెంట్ మేనేజర్ ఉతేయ కుమార్‌ను లోపలికి అనుమతించలేదు.దీంతో ట్రేస్ టు గెదర్ యాప్‌ను ఉపయోగించి అందులో వ్యాక్సినేషన్ స్టేటస్‌ను చూపి బార్‌లోకి రావాలని ఉతేయ కుమార్‌కు కిరణ్ సింగ్ సలహా ఇచ్చినట్లు డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షెన్ వాన్‌కిన్ తెలిపారు.

అతని సూచన ప్రకారం.ఉతేయ కుమార్ మరో బార్‌కి వెళ్లాడు.

అతను అక్కడ డ్రింక్స్ సేవిస్తుండగా.తొలుత వెళ్లిన బికినీ బార్ అసిస్టెంట్ మేనేజర్ గమనించారు.

వెంటనే అక్కడి సిబ్బందికి సమాచారం అందించగా.వారు ఉతేయ కుమార్‌ను పట్టుకుని సెంటోసా డెవలప్‌మెంట్ కార్పోరేషన్ డ్యూటీ మేనేజర్‌కు తెలియజేశారు.

ఉతేయ కుమార్‌ను తన వలె నటించేందుకు అనుమతించిన కిరణ్ సింగ్‌పై అభియోగాలు మోపారు అధికారులు.ఈ కేసుకు సంబంధించి నేరాన్ని అంగీకరించడంతో కిరణ్ సింగ్‌కు ఫిబ్రవరిలో ఐదు రోజుల శిక్ష విధించింది న్యాయస్థానం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube