ఎలివేషన్స్ ఓకే.. కానీ వేర్ ఇస్ ది రొమాన్స్ అంటున్న టాలీవుడ్ ?

ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఇక ఇద్దరు దర్శకులు కూడా ఎవరికి వారు మేమేం తక్కువ కాదు సినిమా యాక్షన్ సీక్వెన్స్ ఎలివేషన్స్ పెడుతూ ఉన్నారు.కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ పాన్ ఇండియా దర్శకులు వెనుకబడి పోయారు అన్నది తెలుస్తుంది.

 Tollywood Heros Missing Romantic Flavour In Movies Kgf 2 Rrr Details, Kgf Chapt-TeluguStop.com

అదే రొమాన్స్ స్టార్ హీరోలను పెట్టి సినిమాలు తీయడం లేదా ఒక సాదా సీదా హీరోతో సినిమా చేసి వాళ్లను స్టార్ హీరోలు చేయడంలో ఇక ఇద్దరు దర్శకులు తర్వాత ఎవరైనా అని చెప్పాలి.ఇక అద్భుతమైన ఎలివేషన్స్ తో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి థియేటర్లో ఈలలు వేసేలా చేయడం కూడా ఈ ఇద్దరు దర్శకులకు సాధ్యం.

ఇక భారతీయ చలన చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్ళింది కూడా ఈ ఇద్దరు దర్శకులే కావడం గమనార్హం.కానీ ఈ ఇద్దరు దర్శకులు రొమాంటిక్ మంత్రాన్ని మాత్రం పూర్తిగా వదిలేశారు ఒకప్పుడు విక్రమార్కుడు చత్రపతి లాంటి సినిమాల్లో మంచి రొమాంటిక్ ఎలివేషన్స్ చూపించిన రాజమౌళి అటు బాహుబలి సినిమా నుంచి రొమాంటిక్ మంత్రాన్ని పక్కనపెట్టి కేవలం యాక్షన్ సీక్వెన్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టాడు.

ఇటీవలే త్రిబుల్ ఆర్ సినిమా లో కూడా ఇలాంటిదే కనిపించింది.

Telugu Prasanth Neel, Rajamouli, Heroism, Ntr, Kgf Chapter, Ram Charan, Romantic

దీంతో హీరోహీరోయిన్ల మధ్య ఒక ముద్దు లేదు ముచ్చట లేదు ఇదేం సినిమా రా బాబు అని ఒక వర్గం ప్రేక్షకులు అసంతృప్తి చెందుతున్నారట.ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సెన్సేషన్ మూవీ కేజిఎఫ్ ఇక ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమాలో కూడా రొమాన్స్ అనేది ఎక్కడా కనిపించదు.కేవలం రాఖీ బాయ్ హీరోయిజం ఎలివేషన్ సన్నివేశాలు తప్ప హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సంభాషణ కూడా ఉండదు అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube