ఖమ్మం:ఉచిత శిక్షణ కోసం స్క్రినింగ్ టెస్ట్..3530 మంది అభ్యర్థులు హాజరు

పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ కోసం ఖంమ్మ జిల్లాలోని స్ధానిక పోలీస్ స్టేషన్లలో పేరు నమోదు చేసుకున్న 3530 మంది అభ్యర్థులకు ఈరోజు స్క్రీనింగ్ టెస్ట్ వ్రాత పరీక్ష నిర్వహించారు.

 Khammam: Screening Test For Free Training..3530 Candidates Attended-TeluguStop.com

పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ పర్యవేక్షణలో గతంలో ప్రకటించిన విధంగా అయా మండల హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ అధికారులు, ఇన్విజిలేటర్లు స్క్రీనింగ్ టెస్ట్ పకడ్బందిగా నిర్వహించారు.

నగరంలోని ఎస్బిఐటి,ఆర్జేసి, ప్రియదర్శిని, వికార్ కాలేజీల్లో రూరల్ మండలం డేర్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్క్రినింగ్ టెస్ట్ సెంటర్లను అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ గౌష్ అలమ్ సందర్శించి అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేశారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతి, యువకులకు పోలీసు ఉద్యోగాలకు ఇవ్వనున్న ఉచిత శిక్షణకు అభ్యర్థులు విశేషంగా స్పందించారని పోలీస్ కమిషనర్ పెర్కొన్నారు.

అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube