తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ దినోత్సవం సందర్భంగా 10 ఏళ్ల కాలంలో సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ప్రగతిపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య( Sandra Venkata Veeraiah ) నిర్వహించారు.
అనంతరం ఉత్సవాల్లో భాగంగా జూన్ 12 తారీఖు నాడు నిర్వహించనున్న తెలంగాణ రన్ కార్యక్రమం సత్తుపల్లి( Sathupally )లోని జేవిఆర్ డిగ్రీ కళాశాల నుండి లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, టీచర్లు, విద్యార్థిని, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు.