24న తెలంగాణ లోకి భారత్ జోడో పాదయాత్ర.. విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపు

ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఈ నెల 24 న తెలంగాణలోకి ప్రవేశించనున్నదని కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ కోరారు.సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నగర కాంగ్రెస్ మైనార్టీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

 Rahul Gandhi Bharat Jodo Padayatra To Telangana On 24th, Rahul Gandhi ,bharat Jo-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.దేశంలో నేటి పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని అన్నారు.

జాతి,కుల, మతాల పేరుతో విడగొడుతు విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.టీఆర్ఎస్, బీజేపీ రెండూ కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.

ఎనిమిది ఏండ్ల కాలంలో టీఆర్ఎస్ రాష్ట్రాన్ని బీజేపీ దేశాన్నీ దోచుకున్నాయని అన్నారు.దేశ స్వాతంత్రానంతరం దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గాంధీజీ ఇచ్చిన పిలుపు హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ గతంలో చేపట్టిందని అన్నారు.

కానీ ఈరోజు ప్రభుత్వాలు భవిష్యత్ తరాలకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టి మత చాందసవాదులుగా ప్రజలను విడగొడుతూ ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు.నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, నేటి ప్రభుత్వాల హయాంలో నిత్యవసర సరుకులు ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

నేటి ప్రభుత్వాల పేరుతో సామాన్య మానవులు బతుకు దెరువుకు అగచాట్లు పడుతున్నారని అన్నారు.వీటన్నింటి నుండి దేశాన్ని విముక్తి చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించారని తెలిపారు.

ఈ పాదయాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు జరుగుతుందని అందులో భాగంగా 24 వ తారీఖున తెలంగాణలో ప్రవేశించనున్నదని తెలిపారు.వేలాది సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు చోటా బాబా, డివిజన్ అధ్యక్షులు జాహీర్ మహమ్మద్ సయ్యద్ గౌస్, నగర కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అబ్బాస్, మైనార్టీ నాయకులు ముజాహిద్ ఇబ్రహీం షేక్ జానీ పాషా, వసీం యూత్ కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ ఆహాద్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube