స్కూల్ ప్రోగ్రాం ని కూడా వ్యాపారమయంగా మార్చిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం

విద్యాసంస్థలలో తారతమ్యాలు చూపిస్తూ ధనర్జీనిజయంగా స్కూల్ ప్రోగ్రాం ని కూడా వ్యాపారం చేయడం దీనికి జిల్లా విద్యాశాఖ అధికారి కూడా హాజరవ్వడం చాలా దుర్మార్గం తక్షణమే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం( Delhi Public School Anniversary Celebrations ) పేరుతో వ్యాపారం చేస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పి డి ఎస్ యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేష్ జిల్లా అధికారులను డీమాండ్ చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కేంద్రంలో విద్యాపేరుతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విచ్చలవిడిగా వ్యాపారమ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నా కూడా జిల్లా అధికారులను పట్టించుకో పోవటం ఏంటని వారు జిల్లా అధికారులను డిమాండ్చే చేశారు.

స్కూల్ వార్షికోత్సవం పేరుతో గోల్డెన్ పాస్ కి 2500, సిల్వర్ పాస్ 600అంటూ వ్యాపారం చేయడం తో పాటు విద్యార్థి, తల్లిదండ్రుల మధ్య ధనిక, పేద తేడాలను చూపించడం ఏంటని వారు ప్రశ్నించారు.విద్యా వ్యాపార దొరలను ప్రశ్నించాలసిన జిల్లా విద్యాశాఖ అధికారి అధికారులు స్పందించకపోవడం శోచనీయంమన్నారు.

తక్షణమే స్కూల్ వార్షికోత్సవ పేరుతో డబ్బులు వసూళ్లు కి పాల్పడుతున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గుర్తింపు రద్దు చేసి స్కూల్ యాజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టాలని వారు డియంండ్ చేశారు.ఈ కార్యక్రమం లో PDSU ఖమ్మం డివిజన్ కార్యదర్శి లక్ష్మణ్, నాయకులు కరుణ్, సాయి, శ్రీకాంత్, గణేష్, తరుణ్, రాజేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

హీరోయిన్ సాయిపల్లవి మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా.. ఆమె జవాబు ఇదే!
Advertisement

Latest Khammam News