మద్యం షాపు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా డిమాండ్

ఖమ్మం జిల్లా( Khammam District ) నేలకొండపల్లి మండల కేంద్రంలో సిండికేట్ మద్యం షాపులను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్( CPI ML ) ప్రజాపందా నేలకొండపల్లి ముదిగొండ సంయుక్త మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శి సివైపుల్లయ్య డివిజన్ నాయకులు పగిడి కత్తుల, రాందాస్ పార్టీ మండల కార్యదర్శి చిర్రాభిక్షం సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి స్నేహలతకు ప్రతినిధి బృందం మెమోరాండం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా సివై పుల్లయ్య మాట్లాడుతూ, మద్యం షాపుకు అనుమతి లేకుండా నిర్వహిస్తూ, ఎమ్మార్పీ రేట్లకు పేద ప్రజల డబ్బును కొల్లగొడుతున్నారని జాయింట్ కలెక్టర్కు వివరించారు.

మద్యం షాపు యజమానులు ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కయ్ బహిరంగంగా అనుమతి లేకుండా షాపులు నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు.గ్రామాలలో బెల్ట్ షాపులను నిబంధనలకు విరుద్ధంగా, విచ్చలవిడిగా నిర్వహిస్తూ, పేద ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు.

ఎక్సైజ్ అధికారులు గ్రామాలు తిరగకుండా, బెల్ట్ షాపులను అరికట్టకుండా చోద్యం చూస్తున్నారని వారు ఆరోపించారు.ఆఫీసులలో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం తప్ప, బెల్ట్ షాపులను అరికట్టే పనిలో లేకపోవటం ప్రజలకు అన్యాయం చేయడమేనని వారు ఆరోపించారు.

మద్యం షాపులను నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ పై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని వారు తెలియజేశారు.

Advertisement
హీరోయిన్ సాయిపల్లవి మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా.. ఆమె జవాబు ఇదే!

Latest Khammam News