ప్రభాస్(Prabhas) కృతి సనన్(Kriti Sanon) జంటగా రామాయణం (Ramayanam) ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఆది పురుష్(Adipurush) .ఈ సినిమా జూన్ 16వ తేదీ ఐదు భాషలలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా చూడటానికి అనుగుణంగా పేద పిల్లల కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranabir Kapoor), టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram charan) ఏకంగా ఇద్దరూ చెరీ 10000 టికెట్లను కొనుగోలు చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇక హిందువుల నమ్మకం ప్రకారం రామాయణం ఎక్కడైతే పారాయణం చేయబడుతుందో అక్కడికి హనుమంతుడు వస్తారని అందుకే ప్రతి థియేటర్లోనూ హనుమంతుడి కోసం ఒక సీట్ కేటాయించాలని తెలియజేశారు.
అయితే తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం ఇప్పుడు మరొక మంచి కార్యక్రమంలో శ్రేయాస్ మీడియా(Shreyas Media) కూడా పాలుపంచుకోనుంది.ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో(Khammam District) ఉన్న ప్రతి రామాలయానికి 101 టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు శ్రేయాస్ మీడియా అధినేత గండ్ర శ్రీనివాస్ రావు తెలిపారు.

ఈ విధంగా టికెట్లు కావాలనుకున్నవారు తనని సంప్రదించాలని ఈయన సూచించారు.ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రాముడు కొలవై ఉన్న నేపథ్యంలో కేవలం ఖమ్మం జిల్లాకు మాత్రమే ఆది పురుష్ టీం ఇలా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తోంది.ఏది ఏమైనా ఈ సినిమా విడుదల కాకముందే పెద్ద ఎత్తున అంచనాలను పెంచేస్తున్నారు.అలాగే మరోవైపు సినిమా పై నెగిటివిటీ కూడా పెరుగుతూ వస్తుంది.మరి ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో తెలియాల్సి ఉంది.ఇక ఇందులో రాముడు పాత్రలో ప్రభాస్ కనిపించగా సీతమ్మ పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు.







