రాష్ట్ర రవాణా శాఖా మాత్యులుగా తన మూడు సంవత్సరాల పదవి కాలాన్ని దిగ్విజయం గా పూర్తి చేసుకొని 4 సంవత్సరం లోకి అడుగుపెడుతున్న జిల్లా మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ కి పౌర సన్మానం చేయుటకు వివిధ సంఘాల బాధ్యులు నిర్ణయించనైనది .ఖమ్మం జిల్లాను అభివృద్హిలో అజయ్ కు ముందు అజయ్ తరువాత అన్నట్లుగా గత మూడు సంవత్సరాలలో అభివృద్ధిలో జిల్లా రూపు రేఖలు మార్చిన మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ కి రాజకీయేతర పక్షాలైన ప్రజా ,పౌర ,స్వచ్చంద ,కుల ,వృత్తి ,వ్యాపార ,మరియు ఉద్యోగ ,ఉపాధ్యా ,కార్మిక ,కర్షక సంఘాల ఆధ్వర్యం లో ది 18-09-2022 న పౌర సన్మానం చేయుటకు నిర్ణయించనైనది ఈ సందర్భంగా 18న ఖమ్మం నగరం గాంధీ చౌక్ కూడలి లో ఉదయం 11:30 గంటలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్,నుంచి భారీ కార్ల ర్యాలీ తో బయలు దేరి బ్రిడ్జి మీదుగా వైరా రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బైపాస్ రోడ్ సప్తపది ఫంక్షన్ హాల్ కు మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటారు .ఉద్యోగ జేఏసీ ప్రజా సంఘాల భాగస్వామ్యం తో పౌర సన్మానం నిర్వహించనున్నట్టు పులిపాటి ప్రసాద్ .షేక్.అప్జల్ హసన్,చిన్ని కృష్ణారావు తదితరులు లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జరిగే పౌర సన్మానంకు వివిధ సంఘాల బాధ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఖమ్మం జిల్లాను రూ.కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మంత్రి ఆధునికరించడమే కాకుండా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారని అన్నారు.ఛాంబర్ ఆఫ్ కామత్రీ టౌన్ ప్రజల విజ్ఞప్తి మేరకువ్యవసాయ మార్కెట్ ను వేరే ప్రాంతం కు తరలించకుండా ఆపి నారని ,అదేవిధంగా గోళ్లపాడు ఛానల్,డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణం ,లకారం ట్యా0క్ బండ్,మ్యూజికల్ ఫౌంటెన్,తీగల వంతెన,వాక్ వే లను ఏర్పాటు చేసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనదైన అభివృద్ధి ముద్ర వేశారని చెప్పారు…ఈ నెల 18 నజరిగే సన్మాన కార్యక్రమం లో ప్రజా,స్వచ్ఛంద ,వృత్తి ,వ్యాపార సంఘాలతో పాటు టీఎన్జీవో,టీజీవో,పంచాయతీ రాజ్,డ్రైవర్ల సంఘం,నాల్గవతరగతి ఉద్యోగులు,ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మంత్రి అజయ్ కుమార్ కు జరిగే పౌర సన్మానం ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు./br>
ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు కొప్పు నరేష్,జనరల్ సెక్రెటరీ గోడవర్తి శ్రీనివాసరావు, మిత్ర ఫౌండేషన్ ఛైర్మెన్ కురువేళ్ళ ప్రవీణ్ ,గుమ్మడిల్లి శ్రీనివాస్ ,గోళ్ళ రాధాకృష్ణ ,అమరాగాని వెంకన్న ,అల్లం పాటి వెంకటేశ్వెర్రెడ్డి ,కిరాణా జాగిరి మార్చంట్స్ అసోసియేషన్ వేములపల్లి వెంకటేశ్వర్లు,టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.వి.ఎస్ సాగర్,tgos జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ,పీ ఆర్ టీ యూ జిల్లా అధ్యక్షులు మోతుకూరి మధు , పంచాయతీ రాజ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాజేష్ ,నందగిరి శ్రీను ,డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులు హకీమ్,నాల్గవతరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోడి లింగయ్య తదితరులు పాల్గొన్నారు….







