రఘునాధపాలెం మండలం( Raghunadhapalem ) చిమ్మపూడి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన ముత్యాల సత్యనారాయణ,శైలజ లకు ఇద్దరు సంతానం.ఏకైక కుమార్తె నవ వధువు ముత్యాల మానస కు ఇల్లందు సమీపంలోని గంధంపల్లి కి చెందిన మాధం శెట్టి ఉమేష్ తో వివాహం నిక్చయమైంది.
వివాహం గురువారం(నేడు) భద్రాచలంలోని సీతారాముల స్వామి సన్నిధిలో జరగనుంది.రెక్కాడితే కానీ,డొక్కాడని నిరుపేద కుటుంబ ఆర్ధిక పరిస్థితి ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర( MP Vaddiraju ) మానవీయ కోణంలో ఆలోచించి రూ.10 వేలు ఆర్ధిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు.
అట్టి ఆర్ధిక సహాయాన్ని మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ చేతుల మీదుగా నవ వధువు మానస స్వగృహానికి బుధవారం వెళ్లి ఆర్ధిక సహాయంను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జమ్మిశెట్టి నిరంజన్,ముత్యాల రాంబాబు,జలగం శ్రీనివాస్ పాల్గొన్నారు.







