ఖమ్మం: టిఆర్ఎస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు

పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగితే హీరో అవుతావ్ అంటూ సాయి గణేష్ నీ ప్రోత్సహించిన బీజేపీ నాయకుల పాత్ర మీద, అలాగే సాయి గణేష్ మృతి పట్ల తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై సమగ్ర విచారణ చేయాలని MLC , ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ డిమాండ్ చేశారు.టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ నందు మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ బిజెపి పార్టీ కార్యకర్త సాయిగణేష్ మృతిపట్ల తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్న బిజెపి నాయకులపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.

 Khammam: Trs Will Not Tolerate False Propaganda Against Party Leaders-TeluguStop.com

యువ నేత కేటీఆర్ జిల్లా పర్యటన చేయనున్న నేపథ్యంలో బిజెపి పార్టీ నాయకులు ఆడిన నాటకంలో యువకుడు సాయి గణేష్ బలి పశువు అయ్యాడని వారు తెలిపారు.శవరాజకీయాలు చేసి ప్రశాంతంగా ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలను భయాందోళనకు గురి అయ్యే విధంగా ప్రయత్నం చేయడం బిజెపి పార్టీ నాయకులు పన్నిన పన్నాగమని, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ని ధ్వంసం చేయడం, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేయడం వారి అరాచక సంస్కృతికి నిదర్శనం అన్నారు.

రాజకీయ చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా లో బిజెపి ఆటలు సాగవని వారు హెచ్చరించారు.బిజెపి నాయకులు రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పైచేస్తున్న తప్పుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పూనుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, విత్తనాభివృద్ధి చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, SUDA చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,జిల్లా రైతు సమన్వయ కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు , నగర టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పడాల నాగరాజు, ఖమ్మం రూరల్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు, కార్పొరేటర్ మురళి మరియు టిఆర్ఎస్ నాయకులు మందడపు మనోహర్, రావూరి సైదా బాబు, కోటేశ్వరరావు, ముత్యాల అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube