పిచ్చి పనులు చేసి జైలుకి వెళ్లిన హీరో.. అప్పటి విషయాలు చెప్పిన ఆర్ఆర్ఆర్ నటుడు?

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు అజయ్ దేవ్‌గణ్.

 Ajay Devgan Opens Up On Being Jailed In His Wild Youth For Twice Details,  Ajay-TeluguStop.com

అయితే కెరిర్ మొదటి నుంచే డిఫరెంట్ కథాంశాలతో ఎంచుకుంటూ అభిమానులను అలరిస్తు వస్తున్నాడు.ఇకపోతే ప్రస్తుతం అజయ్ దేవగన్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

ఇటీవలే విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ ఒక ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

అజయ్ దేవ్‌గణ్ నటుడిగా ముఖ్య పాత్రలో నటించిన తాజా చిత్రం రన్ వే 34. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ లు కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమాకు అజయే దర్శకుడి గా వ్యవహరించారు.

అయితే త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో హీరో అజయ్ దేవ్‌గణ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.స్టార్ హీరో అయినప్పటికీ ఎంతో కూల్ గా ఉంటూ, వివాదాలకు దూరంగా ఉండే అజయ్ యువకుడిగా ఉన్నప్పుడు కొన్ని పిచ్చి పనులు చేశాడట.

Telugu Ajay Devgan, Ajaydevgan, Amitab Bachchan, Bollywood, Jail, Run-Movie

అంతేకాకుండా ఆ పిచ్చి పనులు చేయడం వల్ల జైలుకు కూడా వెళ్ళి వచ్చాను అని తెలిపాడు అజయ్ దేవ్‌గణ్.అని ఒకటే సారి కాదు రెండు సార్లు అని ఆ విషయం గురించి అయిష్టంగానే మాట్లాడుతూ.అసలు ఈ విషయం గురించి మాట్లాడకూడదు ఇదే విషయం గురించి గతంలో కూడా మాట్లాడాను.కానీ అసలు ఏం జరిగింది అన్నది అప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు మాట్లాడవచ్చు అనుకుంటున్నాను అంటూ అసలు విషయాన్ని బయట పెట్టేసాడు.

Telugu Ajay Devgan, Ajaydevgan, Amitab Bachchan, Bollywood, Jail, Run-Movie

మనం వయసులో ఉన్నప్పుడు కొన్ని విచిత్రమైన అలాగే అనాగరికమైన పనులు చేస్తూ ఉంటాము.అలాంటి పనులు అందరూ చేస్తూ ఉంటారు.ఆ సమయంలో మీడియా చట్టం వంటి వాటిని తేలికగా తీసుకుంటాం.అందుకే నేను కూడా రెండు సార్లు జైలుకు వెళ్లి వచ్చాను.ఇందులో మొదటి సారి మా నాన్నగారి గన్ దొంగలించడం వల్ల జైలుకు వెళ్లాను.రెండవసారి ఇంకొక కారణం వల్ల జైలుకు వెళ్లాను అని చెప్పుకొచ్చాడు అజయ్ దేవ్‌గణ్.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube