టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.గత ఏడాది విడాకులు తీసుకుని విడిపోయిన ఈ జంట వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది.
అంతేకాకుండా జంట విడిపోయి సుమారుగా ఆరు నెలలు కావస్తున్నా ఈ జంట కు సంబంధించిన ఏదో ఒక వార్తతో నిత్యం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.అయితే ఇప్పటికీ వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడానికి అసలు కారణం ఏమిటి అన్నది తెలియలేదు.
ఈ విషయంపై వీరిద్దరూ స్పందించలేదు.విడాకుల తర్వాత సమంత నాగచైతన్య లు ఇద్దరు సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నారు.
సమంత మాత్రం నిత్యం సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తూ నిత్యం ఏదో రకమైన కొటేషన్లు పెడుతూనే ఉంది.సమంత నాగచైతన్య జ్ఞాపకాల్ని చెరిపేస్తూ సోషల్ మీడియాలో అతని ఫోటోలు డిలీట్ చేసిన విషయం తెలిసిందే.
ఇటీవలే చైతన్య ని ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో కూడా చేసింది.విడాకుల తర్వాత సమంత పూర్తిగా తన దృష్టిని కెరీర్ పై సారించింది.ఈ నేపథ్యంలోనే వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీబిజీగా గడుపుతోంది.విడాకుల తర్వాత సమంతా నుంచి రాబోతున్న మొదటి సినిమా కన్మణి కాంబో ఖతిజా.

ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటించిన సమంతా, నయనతార లు హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది.ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత మీడియా ముందుకు రానుంది.అయితే ఆ మీడియా సమావేశంలో సమంత చైతన్య కు సంబంధించిన పలు ప్రశ్నలను ఎదుర్కోనుంది సమాచారం.
నాగచైతన్యకు సంబంధించిన ప్రశ్నలకు సమంత ఏ విధంగా స్పందిస్తుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి సమంత నాగ చైతన్య కు సంబంధించిన ప్రశ్నల గురించి స్పందిస్తుందా లేక ఆ ప్రశ్నలను దాటేస్తుందా చూడాలి మరి.







