వైరల్ వీడియో: పిచ్చి ఎక్కిన మనుషుల్లా అరుస్తున్న చైనీయులు..!

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు హల్చల్ చేస్తూనే ఉంటాయి.ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు కూడా నెట్టింట ఒక వీడియో బాగా వైరల్ గా మారింది.

 The Chinese Are Screaming Like Mad People , Social Media, Chinese , Mad Peopl-TeluguStop.com

ఆ వీడియో చూసిన నేటిజన్లు అందరు షాక్ లో ఉండిపోతున్నారు.ఆ వీడియోలో ఎంతో మంది ప్రజలు తాము నివసించే అపార్ట్‌మెంట్ బాల్కనీలో నిలబడి గట్టిగట్టిగా కేకలు వేస్తున్నారు.

వాళ్ళు అలా కేకలు వేయడం చూసిన కొందరు నేటిజన్లు పాపం వాళ్లకు ఏమన్నా ఆపద వచ్చిందేమో అని అనుకుంటున్నారు.మరి కొందరు అయితే వాళ్ళకి ఎమన్నా పిచ్చి పట్టిందా… అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

తీరా వీడియో చూసి,అక్కడ ప్రజలు ఎందుకు అలా అరుస్తున్నారో తెలిసాక షాక్ అవుతున్నారు.నిజానికి తమ గవర్నమెంట్ విధించిన ఆంక్షల వలన అలా ఇళ్లలోనే ఉండి అరవవలిసిన పరిస్థితి వచ్చింది వాళ్లకు వచ్చింది అనే చెప్పాలి.

అసలు వివరాల్లోకి వెళితే.ఈ ఘటన చైనాలోని షాంఘై నగరంలో చోటు చేసుకుంది.చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ మళ్ళీ మొదలయిన కారణంగా చైనా ప్రభుత్వం షాంఘైలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను విధించింది.లాక్ డౌన్ అంటే అలాంటి ఇలాంటి లాక్ డౌన్ కాదండోయ్.

పూర్తి స్థాయి లాక్ డౌన్ అన్నమాట.అంటే ఎలాంటి పరిస్థితులలోను ప్రజలు అడుగు బయట పెట్టకూడని లాక్‌డౌన్.

ఈ లాక్ డౌన్ మొదలయ్యి ఇప్పటికి వారం రోజులు అవుతుంది.కనీసం నిత్యవసరాల కోసం కూడా ప్రజలు బయటకు రాకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో 26 మిలియన్ల మంది నివసించే షాంఘైలో ప్రజలు విస్తిపోయి ఇలా అపార్ట్మెంట్స్ బాల్కనీలోకి వచ్చి గట్టి గట్టిగా కేకలు వేస్తున్నారు.వారం రోజుల నుండి ఇళ్లకే పరిమితం అవ్వడంతో ప్రజలు విస్తిపోయి తమలోని ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ లను బయటకు కక్కే క్రమంలో ఇలా అరుస్తూ కాస్త రిలీఫ్ పొందుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో గురించి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది.ఈ వీడియో చూసి నేటిజన్లు సైతం అవాక్ అవుతున్నారు.భవిష్యత్తులో ఇంతకన్నా ఘోరమైన పరిస్థితులను చూస్తమేమో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube