అంగరంగ వైభవంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం

రాములోరి కళ్యాణంతో భద్రాద్రి పులకించిపోయింది అశేష జన వాహిని నడుమ కనుల పండుగ గా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు భక్తులు లేకుండా ఆలయ అర్చకుల సమక్షంలోనే జరిగిన కళ్యాణం, నేడు భక్తుల నడుమ భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది.ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి ఊరేగింపుగా తరలించారు సీతారాముల కల్యాణం వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు.

 Welfare Of Bhadradri Sri Sitaram As The Glory Of Angaranga-TeluguStop.com

మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సముహూర్తంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు.దీన్ని వీక్షించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు వంటి పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరైయ్యారు.

ప్రభుత్వం తరుపున సంప్రదాయబద్ధంగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు పట్టువస్త్రాలు, జిల్లా ఇంఛార్జి, రావాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ముత్యాల తలంబ్రాల సమర్పించారు.వారితో పాటు రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ గారు హాజరైయ్యారు.

స్వామి వారి కళ్యాణం చూసేందుకు సుమారు 2.5 లక్షల మంది తరలివచ్చారు.భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

భక్తులకు వడదెబ్బ తగలకుండా.తాగు నీటితో పాటు మజ్జిగ ఎర్పాటు చేశారు.భక్తజనులకు తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచారు.

భారీ పోలీస్‌ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా నీడలో సీతారాముల కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube