భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీస్ అందింది.ఈ మేరకు ఏఐటీయూసీ సమ్మె నోటీసును ఇచ్చిందని తెలుస్తోంది.
దసరా అడ్వాన్స్ తో పాటు లాభాల బోనస్ చెల్లింపులకు 48 గంటల డెడ్ లైన్ ఇచ్చారు ఏఐటీయూసీ కార్మికులు.లేని పక్షంలో ఈనెల 20వ తేదీ నుంచి కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు రిలే దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే 21న సింగరేణి వ్యాప్తంగా ఒక్క రోజు సమ్మె ఉంటుందని ఏఐటీయూసీ తెలిపింది.