భద్రాచలం ఎఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణ ఎస్సై మధుప్రసాద్ మరియు సిబ్బంది ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద తేదీ.25.9.22 న మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మోటార్ సైకిల్ మరియు ఒక కార్ లో 77 కిలోల నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు.వారిని విచరించగా తమ పేర్లు 1.బానోతు హరి, నివాసం.దుబ్బ తండా(మర్రిపెడ బంగ్లా) 2.గుండె పరశురాం,r/o.వీరారం (మర్రిపెడ బంగ్లా) అని తెలిపి సీలేరు పరిసర ప్రాంతంలో గంజాయిని రాము అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి తమ గ్రామస్తుడైన బానోతు పాండు నాయక్ కు మరియు హైదరాబాద్ నకు చెందిన ప్రకాష్ కు ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు వివరించారు.పట్టుబడిన గంజాయి విలువ సుమారు 15 లక్షలు ఉంటుంది.
వీరి వద్ద నుండి కారు,మోటార్ సైకిల్,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా భద్రాచలం సిఐ నాగరాజు రెడ్డి, ఎస్సైలు మధు ప్రసాద్,రాజేష్ కుమార్ మరియు గంజాయిని పట్టుకున్న సిబ్బందిని భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అభినందించారు.







