డ్రగ్స్ మాఫియాపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది.గత సీజేఐకి వచ్చిన ఓ లేఖ ఆధారంగా కేసు విచారణ చేపట్టనున్నట్లు ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ప్రకటించారు.
ఈ వ్యవహారంలో స్పందించాలని సొలిసిటర్ జనరల్ కు నోటీసులు జారీ చేశారు.అదేవిధంగా న్యాయవాది షోయబ్ ఆలంను అమికస్ క్యూరీగా ధర్మాసనం నియమించింది.
అనంతరం తదుపరి విచారణ అక్టోబర్ 18 కి వాయిదా వేసింది.







