భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ లో విషాదం చోటుచేసుకుంది.బట్టలు ఉతకడానికి మల్లన్న వాగు వద్దకు వెళ్లిన ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందారు.
రోళ్ల గడ్డ కు చెందిన దుగ్గి స్వరూప(45), ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల కు చెందిన చాపల మౌనిక(18) నీటిలో పడి మృతి చెందారు.రొల్ల గడ్డ కు చెందిన స్వరూప ఇంటికి మేనకోడలు అయినా మౌనిక వచ్చింది ఇద్దరు కలిసి బట్టలు ఉతకడానికి మల్లన్న వాగు వద్దకు వెళ్లారు ప్రమాదవశాత్తు మౌనిక వాగుల పడిపోవడంతో ఆమెను కాపాడేందుకు స్వరూప యత్నించడంతో ఇద్దరు నీట మునిగి చనిపోయారు ఈ ఘటనతో రోళ్ల గడ్డ లో విషాదం అలుముకుంది.
చుట్టపుచూపుగా వచ్చిన యువతి అకాల మరణం అందరిని కలిచి వేసింది







