కొత్తగూడెంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ మేరకు కొత్తగూడెం జనసేన అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ ఆయన ప్రచారం చేపట్టారు.

 Pawan Kalyan Election Campaign In Kothagudem-TeluguStop.com

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొని నిలబడ్డానంటే దానికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తే కారణమని తెలిపారు.జనసేన పోటీ చేసే స్థానాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్ధతుగా నిలిచి వారి గెలుపు కోసం కృషి చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.

సనాతన ధర్మం, సోషలిజాన్ని పక్కపక్కన నడపగలిగేదే జనసేన అన్న పవన్ కల్యాణ్ ఇదే తన ఇజం.హ్యుమనిజం అని చెప్పారు.అలాగే అవినీతిపై పోరాడే యువతకు జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube