కొత్తగూడెంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం
TeluguStop.com
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ మేరకు కొత్తగూడెం జనసేన అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ ఆయన ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొని నిలబడ్డానంటే దానికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తే కారణమని తెలిపారు.
జనసేన పోటీ చేసే స్థానాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్ధతుగా నిలిచి వారి గెలుపు కోసం కృషి చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.
సనాతన ధర్మం, సోషలిజాన్ని పక్కపక్కన నడపగలిగేదే జనసేన అన్న పవన్ కల్యాణ్ ఇదే తన ఇజం.
హ్యుమనిజం అని చెప్పారు.అలాగే అవినీతిపై పోరాడే యువతకు జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు.
కరెన్సీ నోట్ల కట్టలను మంటల్లో పడేసిన యూఎస్ వ్యక్తి.. వీడియో వైరల్..