భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై( MLA Koonanneni Sambasiva Rao ) కేసు నమోదైంది.ఎంపీడీవో విజయ్ భాస్కర్ రెడ్డి ( MPDO Vijay Bhaskar Reddy )ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కూనంనేనిపై పాల్వంచ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల కోడ్ పాటించకుండా కూనంనేని సమావేశం నిర్వహించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.అదేవిధంగా సభ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని ఆరోపించారు.
ఈ క్రమంలో సెక్షన్ 188, 171-సీ కింద కూనంనేనిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.