మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని వై యస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పరామర్శించారు.ఇటీవల తాటి వెంకటేశ్వర్లు కూతురు తాటి మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకోగా పినపాక నియోజకవర్గం బూర్గంపహడ్ మండలం సారపాక గ్రామంలో పాదయాత్ర చేస్తున్న షర్మిల వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లారు.
తాటి మహాలక్ష్మి చిత్రపటం వద్ద పూలు జల్లి నివాళి అర్పించారు.మహాలక్ష్మి మృతి బాధాకరమని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని షర్మిల కోరుకున్నారు.
అనంతరం కూతురు మృతికి గల కారణాలు తెలుసుకున్నారు.కూతురును తల్చుకుని వెంకటేశ్వర్లు కంట తడి పెట్టుకోగా షర్మిల ఓదార్చారు.