భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మైనర్లు హల్ చల్ చేశారు.ఈ క్రమంలో రెండు వర్గాలకు చెందిన మైనర్ యువకులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు.
అయితే బైక్ విషయంలో ఇద్దరు యువకుల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారి తీసింది.ఈ క్రమంలో నడిరోడ్డుపై మైనర్లు నానా హంగామా సృష్టించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కొందరిని అదుపులోకి తీసుకున్నారు.