ఈ నెల 28వ తేది ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో జరగనున్న పోలీస్ కానిస్టేబుళ్ళ ప్రాధమిక రాత పరీక్షకు హజరవుతున్న అభ్యర్థులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్.
జి ఐపీఎస్ పలుసూచనలు చేయడం జరిగింది.
•పరీక్ష ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 గం ల వరకు నిర్వహించబడుతుంది.
•అభ్యర్థులు ఒక రోజు ముందుగానే తమకు కేటాయింపబడిన పరీక్షా కేంద్రం గురించి తెలుసుకుని సరైన సమయానికి చేరుకునేట్లు తగు రవాణా ఏర్పాట్లు చేసుకోవాలి.
•అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగానే చేరుకోవాల్సి వుంటుంది.
•ఉదయం 10:00 గం.ల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసి వేయబడుతాయి, ఒక్క నిముషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోని అనుమతించరు.
•పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి బ్యాగులు,సెల్ ఫోన్లు,వాచ్ లు,క్యాలిక్యులేటర్ మరియు ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవు
•అభ్యర్థులు కేవలం హాల్ టికెట్,పెన్నుతో మాత్రమే పరీక్ష కేంద్రంలోకి రావాల్సి ఉంటుంది.
•అభ్యర్థులు తమ హాల్ టికెట్ పై పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అంటించుకొని రావాలి,లేనిచో పరీక్షకు అనుమతించరు.
అభ్యర్థులు తమ హాల్ టికెట్ లో అన్ని వివరాలను ముందుగానే సరి చూసుకోవాలి.
•హాల్ టికెట్ తో పాటు ఎటువంటి గుర్తింపు కార్డులు అవసరం లేదు
•పరీక్షకు బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు తీసుకోవడం(ఆధార్ వేలి ముద్రలు) తప్పనిసరి.
•ప్రాథమిక పరీక్షకు బయోమెట్రిక్ వేలిముద్రల హాజరు నమోదు చేస్తారు కాబట్టి మెహెందీ,టాటూలు లాంటివి లేకుండా చూసుకోవాలి
•పరీక్షలో 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి (ఏ.బి.సి.డి ప్రశ్నాపత్ర కోడ్ వేర్వేరుగా), 200 మార్కులు పరీక్షలో తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి.
•అభ్యర్థులు తమ రూమ్ నెంబర్ మరియు సంబంధిత సీట్ చేరుకొని ప్రశ్నాపత్ర కోడ్ ను పరిశీలించుకోవాలి.
విద్యార్థులకు పరిశుద్ధమైన త్రాగు నీటిని హాలుకు దగ్గరలో అందుబాటులో ఉంచడం జరుగుతుంది
•పరీక్ష వేళలు ముగిసేవరకు అభ్యర్థులు పరీక్షా గదిలోనే ఉండవలిసి ఉంటుంది
•పరీక్ష ముగిసిన తర్వాత అందరి OMR షీట్ తీసుకున్నాక,అందరి బయోమెట్రిక్ అటెండెన్స్ పూర్తయ్యాకనే అభ్యర్థులను పరీక్ష గది నుండి ఒకేసారి బయటకి పంపించడం జరుగుతుంది.
•కోవిడ్ నిబంధనల మేరకు విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ లను ధరించాలి.
•థర్మల్ స్క్రీనింగ్ మరియు సానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకున్నాకే కేంద్రంలోకి ప్రవేశించాలి.
•అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వచ్చి పోయే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ తమ గమ్య స్థానాలకు క్షేమంగా చేరుకోవాలని,అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోని,రాత పరీక్షలో విజయం సాధించాలని జిల్లా ఎస్పీ గారు ఆకాక్షించారు.







