భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లోని ఎర్రబోరు గ్రామంలో ఒకే ముహూర్తం లో ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్న భర్త వివరాల్లోకి వెళితే గత రెండు సంత్సరాలక్రితం మడివి సత్తిబాబు, స్వప్న కుమారి చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు కొంతకాలం సహజనం చేశారు వీరికి ఒక పాప పుట్టింది…తర్వత వీరిద్దరూ కొంత కాలం వేర్వేరుగా ఉన్నారు….ఈ క్రమంలో సత్తిబాబు కుర్ణపల్లి గ్రామానికి చెందిన మేనకోడలు వరుసైన సునీత తో పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తున్నారనీ తెలిసి మొదటి ప్రియురాలు స్వప్న కుమారి కూడా సత్తిబాబు ఇంటివద్దకు వచ్చి పెద్దల సమక్షంలో వీరి ముగ్గురి అంగీకారంతో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు.
వీరిలో స్వప్న కు ఒక పాప కాగా,సునీత కు ఒక బాబు ఉండగా ఇప్పుడు సునీత గర్భిణీ గా ఉంది.ఇప్పుడు పెద్ద మనుషులు సమక్షంలో పెళ్లి చేయాలని నిర్ణయించగా ముగ్గురి కుటుంబాల అంగీకారంతో ఈరోజు ఉదయం 7 30 గంటలకు ముహూర్తం నిర్ణయించారు.
కానీ మీడియా లో ఈ ఒక్క మగాడు ఇద్దరు భామల పెళ్లి అని హల్చల్ అవడంతో కుటుంబ సభ్యులు రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి తంతు పూర్తి చేశారు.మీడియా ఈరోజు ఉదయం పెళ్లి విషయం కవరేజ్ కోసం వెళ్లగా ఏమీ జరగలేదు అని పిల్లలకు అన్నప్రాశన కార్యక్రమం మాత్రమే అని తప్పించుకు తిరుగుతున్నారు.
పెళ్లి వేదిక కాస్త అన్నప్రాశన కార్యక్రమం గా మారింది….ఏది ఏమైనా సత్తిబాబు తన ఇద్దరి భామలతో కుటుంబ సభ్యుల అంగీకారం,అలాగే గ్రామస్థుల సహకారంతో పెళ్లి చేసుకుని ఇద్దరి పిల్లలతో సంతోషంగా ఉన్నాడు.