భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో( Bhadrachalam ) ఇవాళ ఐటీడీఏ సమావేశం( ITDA Meeting ) జరగనుంది.దాదాపు 19 నెలల తరువాత నిర్వహిస్తున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో( Bhatti Vikramarka ) పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు,( Tummala Nageswara Rao ) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Komatireddy Venkatreddy ) హాజరుకానున్నారు.
ఈ క్రమంలో మంత్రులు ఇప్పటికే హైదరాబాద్ నుంచి భద్రాచలానికి బయలుదేరారు.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే కానుండగా.ఇందులో ప్రధానంగా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రణాళికల రూపకల్పనపై చర్చించనున్నారు.ఈ క్రమంలో ఐటీడీఏ సమావేశానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు.