తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో కేసీఆర్ పర్యటిస్తున్నారు.
ఎన్నికల ప్రచారానికి వస్తుండగా సీఎం కేసీఆర్ ప్రగతిపథం వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారని తెలుస్తోంది.ఈ మేరకు కొత్తగూడెంలో కేసీఆర్ వాహానాన్ని తనిఖీ చేశారు.
అనంతరం ఆయన కొత్తగూడెంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.