భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వేదికగా ఇందిరమ్మ ఇళ్ల నమూనాను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రారంభించారు.భద్రాద్రి రాములవారి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆడబిడ్డల పేరుతో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు.పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లని( Indiramma Houses Scheme ) తెలిపారు.
తమ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లు ఇవ్వబోతుందని ఆయన తెలిపారు.రాష్ట్రంలోని పేదవారితో కేసీఆర్( KCR ) ఆటలాడుకున్నారని విమర్శించారు.
మొదటి నుంచి ఖమ్మం ప్రజలు కేసీఆర్ ను నమ్మలేదన్నారు.ఈ క్రమంలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని తెలిపారు.అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం( Free Bus ) కల్పిస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని వెల్లడించారు.దాంతో పాటు అర్హులైన అందరికీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు.