భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా పలు రకాల మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషం , ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక నిజమైన చాలెంజ్ ఎందుకంటే ఆక్సిజన్ కేంద్రాలు నెలకొల్పే పరిస్థితి మనకు వచ్చింది అంటే మనం మొక్కలు నాటడం, పెంచడం బాధ్యతగా తీసుకోవాలన్నారు మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం వల్ల నేలతల్లికి అలాగే మన సమాజానికి ఎంతో ఉపయోగకరమని, మనమందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు నాటడం చాలా అవసరమని కాబట్టి అందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు.
సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారానికి మద్దతు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి ప్రజలలో మంచి అవగాహన కల్పిస్తూ, చెట్లు నాటే విధంగా ప్రోత్సహిస్తున్నారు.ఇంతటి అద్భుతమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు…







