సీఎం కేసీఆర్ దీక్ష సక్సెస్ అవుతుందా?

ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో టీఆర్ఎస్ నేతలు రేపు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నిరసన దీక్ష చేయనుంది.ఈ దీక్షలో తెలంగాణ సీఎం కేసీఆర్ రానున్నారు.

 Will The Initiation Of Cm Kcr Be Successful Cm Kcr, Delhi , Bjp Party , Modi ,-TeluguStop.com

రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తుంది.రేపటి ఆందోళనలతో తొలి విడత నిరసనలు ముగియనున్నాయి.

మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.జాతీయ రహదారులను దిగ్భంధించారు.

జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించారు.కలెక్టరేట్లను ముట్టడించారు.

ఈ వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరసనకు దిగారు.రేపు టీఆర్ఎస్ ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చింది.

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ నిరసన దీక్షలకు దిగనుంది.ఈ దీక్షలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ నిరసన దీక్ష ఏర్పాట్లను ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు.

తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో వరి ధాన్యం పండించవద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

అయితే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరి ధాన్యం పండించాలని రైతును రెచ్చగొట్టారని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.రైతులు వరి ధాన్యం పండిస్తే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయించేలా తాము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని కూడా చెప్పారని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.

వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ చేసిన ఆందోళనల కార్యక్రమాల సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రకటనలను కూడా టీఆర్ఎస్ నేతలు ప్రస్తావించారు.

Telugu Bandi Sanjay, Bjp, Central, Delhi, Formmers, Kcr, Modi, Paddy, Piyush Goy

పార్లమెంట్ ఉభయ సభల్లో వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ ను టీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తారు.వాయిదా తీర్మాణాలు, ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ప్రస్తావించారు.అయితే రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ టీఆర్ఎస్ లేవనెత్తిన ఈ అంశంపై సమాధానం ఇచ్చారు.

అన్ని రాష్ట్రాల్లో ఏ రకమైన విధానాలను అవలంభిస్తున్నామో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధానాన్ని అవలంభిస్తున్నామని చెప్పారు.రాజకీయ లబ్ది కోసమే టీఆర్ఎస్ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తుందని కూడా చెప్పారు.

పీయూష్ గోయల్ ప్రకటనపై టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు.పీయూష్ గోయల్ ప్రజలతో పాటు చట్ట సభలను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది.

విదేశాలకు వరిధాన్యంను ఎగుమతి చేస్తున్నా కూడా రాజ్యసభను తప్పుదోవ పట్టించేలా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుడు ప్రకటన చేశారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ నేతలు ఆయనపై ప్రివిలేజ్ మోషన్ నోటీసు కూడా ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube