తెలంగాణ వడ్లు కొనే వరకు కేంద్రంపై పోరు ఆగదు: రైతు దీక్ష లో మంత్రి పువ్వాడ అజయ్

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రైతు రాజు అయ్యి, రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించడం తట్టుకోలేని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కేసిఆర్ గారి మీద కక్ష సాధింపు కోసం ఇక్కడి రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతుందని, కేంద్రం తన తప్పు తెలుసుకుని తెలంగాణ రైతన్న పండించిన యాసంగి పంటను అంతా కొనేవరకు ఈ ఉద్యమం ఆగదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు.తెలంగాణలో రైతు ధాన్యం కొనుగోలులో బీజేపీ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్ర టి.

 Fight Against Center Will Not Stop Till Telangana Paddy Is Bought: Minister Puva-TeluguStop.com

ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఅర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు ఖమ్మం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్ నందు చేపట్టిన నిరసన దీక్షలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని, ప్రసంగించారు.రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదన్న విషయం గుర్తుంచుకోవాలని, రైతులను ఏడిపించి మీరు బాగుపడరని అన్నారు.మండుటెండలో మత్తడి తాకని చెరువులు నేడు పరవళ్ళు తొక్కుతున్నాయని అన్నారు.

బిజేపి పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షభం, పవర్ హాలిడే లు ఉన్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఇస్తు పంటలు విస్తారంగా పండిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదన్నరు.ముఖ్యమంత్రి కేసీఅర్ కేవలం మూడు ఏళ్ళలో కాళేశ్వరం ప్రాజెక్టు ను కట్టి లక్షల ఎకరాలకు నీరు పారించి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.

తెలంగాణలో మిషన్ భగీరథ పథకం అద్భుతంగా ఉందని మీ మంత్రి గజేంద్ర సింగ్ శికావత్ కొనియడటం, ముఖ్యమంత్రి కేసీఅర్ మొనగాడు ఆని ప్రకటించడంతోనే కేసీఅర్ సమర్థత అర్దం అవుతుందన్నారు.గత రెండు సంవత్సరాలుగా తెలంగాణలో రైతుల నుండి ధన్యం కోనుగోలు చేసి వారిని ఆదుకున్నది తెలంగాణ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.

ప్రతి గింజ కొంటామని చెప్పిన బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడలేక మొహం చాటేశారని అన్నారు.ఇదే విషయమై ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలవడానికి వెళ్తే మంత్రులను హీనంగా చూస్తూ అవమానపరిచే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.

పైగా తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయాలని ఉచిత సలహాలు ఇవ్వటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేఖ విధానాల వల్లే నేడు మంత్రులుగా ఉన్నా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన చేస్తున్నారని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు ఈ ఉద్యమం కొనసాగించాలని రైతు బిడ్డగా కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు.బీజేపీ వ్యతిరేక దీక్ష మొదలైందని, ఓపిక ఉన్నంత వరకు, బీజేపీ కళ్ళు తెరిచే వరకు దీనిని కొనసాగిస్తామని, కేంద్రం దిగిరాకపోతే ఉద్యమం ఉదృతం అవుతుందని హెచ్చరించారు.

రాజకీయంగా మనం ఏ స్థాయి నాయకుల అయినా ముందుగా రైతు బిడ్డలం.వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాం.రైతు సంతోషంగా ఉంటే, రెండు పంటలు పండిస్తే దేశమంతా అందరూ కడుపు నిండా అన్నం తింటారని వివారించారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురైందని, తెలంగాణ ఏర్పడితే ఇక్కడి రైతు సంతోషంగా ఉంటాడని, నీళ్ళు, నిధులు, నియామకాల నినాదంతో కెసీఆర్ ఉద్యమం చేపట్టి రాష్ట్రం సాధించారని అన్నారు.

వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అనతి కాలంలోనే దేశానికి అన్నపూర్ణగా మార్చారని, 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తున్న ఘనత రాష్ట్రం దే అన్నారు.తెలంగాణ రాక ముందు 30 లక్షల ఎకరాల్లో సాగు అయ్యే భూమి.

తెలంగాణ వచ్చాక సీఎం కేసిఆర్ గారి నాయకత్వంలో నేడు కోటి 30 లక్షల ఎకరాల్లో సాగు అవుతుందన్నారు.తెలంగాణ ప్రాంతం చేసుకున్న అదృష్టం కేసిఆర్ సీఎం కావడం.

ఈ ప్రాంత అవసరాలు, సమస్యలు తెలిసిన వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుంది అనేది నేడు మనం చూస్తున్నామన్నారు.తెలంగాణ వస్తె కరెంట్ ఉండదని అంటే 24 గంటల నాణ్యమైన కరెంట్ ను వ్యవసాయానికి ఉచితంగా అందిస్తు, రైతులు రెండు పంటలు పండిస్తున్నారు పేర్కొన్నారు.

రైతు బంధు ద్వారా రైతుకు పెట్టుబడి ఇస్తున్నారు.నేడు 63 లక్షల మంది ఖాతాల్లో రైతు బంధు నిధులు వేస్తున్నారు.

ఇప్పటికే 50 వేల కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో రైతు బంధు ద్వారా వేశారని గుర్తు చేశారు.ఇది చూసి ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం రైతును ఇబ్బంది పెట్టడం కోసం తెలంగాణలో యాసంగి పంటను కొనమని పార్లమెంటులో నిర్దాక్షిణ్యంగా, నిర్లజ్జగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

యాసంగిలో వరి వేయొద్దని మనం ఊరూరు తిరిగి రైతులకు చెప్తుంటే.బీజేపీ నేతలు వరి వేయాలని నేను కొనిపిస్తా అని అన్న బండి అనే తొండి సంజయ్ ఇప్పుడు ఏం సమాధానం ఇస్తారో చెప్పాలన్నారు.

రైతు పండించిన ప్రతి గింజ కొనిపించే బాధ్యత నాది అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.? యాసంగిలో వరి ధాన్యం కేంద్రం కొనదు కాబట్టి వరి వేయొద్దు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటలు రైతులు వినడం వల్ల 54 లక్షల నుంచి 34 లక్షల ఎకరాలకు వరి సాగు తగ్గిందని వివారించారు.పంజాబ్, హర్యానాలో కొన్నట్లే మన దగ్గర ధాన్యం కొనాలి అంటే నూకలు అవుతాయి… బియ్యం మాకు ఇచ్చి, నూకలు మీరు తినాలన్న కేంద్ర మంత్రి మూర్ఖపు పీయూష్ గోయల్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.రైతులకు ఆన్యాయం చేయకుండా బీజేపీ తన తప్పు తెలుసుకుని ఇక్కడి ధాన్యం మొత్తం కొనాలని, ఇప్పటికే గ్రామ పంచాయతీలు తీర్మానం, జిల్లా పరిషత్ తీర్మానాలు కూడా పంపామన్నారు.

కేసిఆర్ గారి నాయకత్వంలో రైతులు లబ్ది పొందుతున్నారు.గతంలో విత్తనాలు, ఎరువులకు క్యులో ఉన్నారు.నేడు ఆ పరిస్థితి లేదని, కేసిఆర్ గారికి రైతులను దూరం చేయాలని బీజేపీ పన్నాగం పన్నిందని అది ఎన్నటికి జరగదన్నారు.రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సింది కేంద్రమే.అయితే అది కాదని రైతులను ఇబ్బంది పెడుతుందని, కాబట్టి దీనిని నిరసిస్తూ ప్రతి రైతు ఎంటి పై నల్ల జెండా ఎగురేసి నిరసన తెలపాలని అన్నారు.11వ తేదీ కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేస్తున్నామని, దీనికి మీరు అంతా మద్దతు తెలపాలని, దేశంలో బీజేపీ మెడలు వంచే నాయకులు సీఎం కేసిఆర్ అని పేర్కొన్నారు.బిడ్డా మాకు తెలుసు మీ మెడలు వంచి, రైతు పండించిన పంట కొనిపించే బాధ్యత తెరాస తీసుకుంటుందని, అప్పటి వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.దీనికి అందరు కలిసి రావాలని రెండు చేతులు జోడిస్తూ నమస్కరిస్తున్నానన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube