తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు, వీరనారి చిట్యాల ఐలమ్మ పోరాటాన్ని కించపరిచిన బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి దిష్టిబొమ్మను ఖమ్మం జిల్లా కేంద్రములోని చాకలి ఐలమ్మ విగ్రహం ఎదుట దగ్ధం చేశారు.తొలుత అంబేద్కర్ సెంటర్ నుండి జెడ్పి సెంటర్ మీదుగా ధర్నా చౌక్ ఐలమ్మ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఖబర్దార్ ప్రకాష్ రెడ్డి ఖబర్దార్ అంటూ రజక సంఘం నాయకులు నినాదాలిచ్చారు.ఈ సందర్భంగా రజక సంఘం సీనియర్ నాయకులు రేగళ్ల సీతారాములు, జక్కుల వెంకటరమణ, కణతల నరసింహా రావు, తమ్మారపు బ్రమ్మయ్య, సత్తెనపల్లి శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాటాన్ని, ఆమె ధైర్యాన్ని, త్యాగాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కీర్తిస్తుంటే, ప్రభుత్వాలు గుర్తించి తగిన గుర్తింపు గౌరవమిస్తుంటే కళ్ళుండి చూడలేని, చెవులు ఉండి వినలేని బీజీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి చరిత్రహీనుడని అని వారంబరు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తెలియకపోతే పుస్తకాలు చదువుకోవాలని వారన్నారు.
నాడు భూమికోసం భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, దొరల ఆగడాలకు, నైజాం, రాజాకారులకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాటం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిందని వారన్నారు.పోరాటాన్ని కించపరిస్తే సహించేదిలేదని వారన్నారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు తంగేళ్లపల్లి శ్రీనివాస్, పంతంగి రవికుమార్, తెనాలి వీరబాబు, వట్టికోట దర్గయ్య, గోలి రామారావు, కొలిపాక వెంకట్, గడ్డం ఉపేందర్, కాకులహారం నరసింహ, వట్టికోట దర్గయ్య, మాచర్ల వెంకన్న, సట్టు సత్యనారాయణ, కొత్తపల్లి పుష్ప, సట్టు కళావతి, మాచర్ల వేలాద్రి, వట్టికోట అప్పారావు, తుపాకుల మధు, రాచకొండ నవీన్, లింగంపల్లి సైదులు, మంకెన నాగరాజు, రాచకొండ సాంబ, కొత్తపల్లి మధు, కట్టంకురి సోమయ్య, వడ్రానపు కిషోర్, వడ్రానపు యాకయ్య, పావురాల ఉపేందర్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు దొనకొండ ముత్తయ్య,నెల్లుట్ల వెంకన్న మాచర్ల సైదులు, పావురాల ఆనంతరాములు, తదితరులు పాల్గొన్నారు.