ఈనెల 31 నుండి ప్రారంభమవుతున్న గణేష్ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు కొత్తగూడెం పట్టణంలోని గణేష్ ఉత్సవ కమిటీలు,అన్ని మతాల పెద్దలు మరియు పోలీసు అధికారులతో పీస్ కమిటీ మీటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ గణేష్ నవరాత్రులలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
పండుగలను ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని కోరారు.గణేష్ విగ్రహ ప్రతిష్టల కోసం ఏర్పాటు చేసే మండపాల వద్ద నిత్యం బాధ్యతగా కమిటీ సభ్యులు ఉండాలని సూచించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ ఉత్సవ కమిటీలు,అన్ని మతాల పెద్దలు పోలీసువారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేశారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే.ఆర్.కే ప్రసాద్,కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వరబాబు,సిఐలు రమాకాంత్,సత్యనారాయణ,రాజు,అబ్బయ్య మరియు తదితరులు పాల్గోన్నారు.