హరితహారం లక్ష్యం పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

తెలంగాణ కు హరితహారం కార్యక్రమం క్రింద ఈ సంవత్సరం జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.

 District Collector Vp Gautham On Haritha Haram Programme, Haritha Haram Programm-TeluguStop.com

గౌతమ్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో హరితహారం పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాకు ఈ సంవత్సరం 50 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, నేటివరకు 29.914 లక్షలు (59.83 శాతం) పూర్తి చేసినట్లు తెలిపారు.543 ప్రదేశాల్లో 13.335 లక్షల మొక్కల జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తిచేసినట్లు, మిగులు మొక్కల జియో ట్యాగింగ్ వెంటనే పూర్తి చేయాలన్నారు.శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు ప్లాంటింగ్ కి చర్యలు చేపట్టి, పూర్తి చేయాలన్నారు.

కెనాల్ బండ్ మల్టీ లేయర్ ప్లాంటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేయాలన్నారు.ఖాళీ స్థలాలు గుర్తించి, బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. లే అవుట్ల గ్రీన్ స్పెస్ లో ప్లాంటేషన్ చేయాలన్నారు.పల్లె ప్రకృతి వనాల్లో ఇంకనూ మొక్కలు నాటాల్సిన చోట వెంటనే పూర్తి చేయాలన్నారు.నాటిన మొక్కలకు ఎప్పటికప్పుడు ఆన్లైన్ నమోదులు పూర్తి చేయాలన్నారు.10 శాతం గ్రీన్ బడ్జెట్ ను పూర్తిగా వినియోగించాలన్నారు.ఆగస్టు 5 లోగా లక్ష్యం పూర్తికి కార్యాచరణ చేయాలన్నారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మొగిలి స్నేహాలత, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, డీఆర్డీవో విద్యాచందన, జెడ్పి సిఇఓ అప్పారావు, ఎడి హార్టికల్చర్ అనసూయ, డిపివో హరిప్రసాద్, సత్తుపల్లి ఎఫ్డివో సతీష్ కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్ర రెడ్డి, జిల్లా ఇర్రిగేషన్ అధికారి వెంకట్రాం, పీఆర్ ఇఇ శ్రీనివాసరావు, మునిసిపల్ కమిషనర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube