సిద్ధు జొన్నలగడ్డ చేతుల మీదుగా 'ఆన్ ది వే' చిత్ర టైటిల్ విడుదల !!!

ఎస్ఎస్ క్రియేటివ్ కమర్షియల్స్ సంధ్య 35 ఎమ్ఎమ్ ప్రజెంట్స్ ‘ఆన్ ది వే’ చిత్ర టైటిల్ లోగోను డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ విడుదల చేశారు.క్రైమ్ కామెడి థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో ఆనంద్ వర్ధన్, దివి, అర్జున్, స్నేహల్, సునీల్, హర్ష వర్ధన్, రాఘవ, మెహబూబ్ బాషా ప్రధాన పాత్రలో నటించారు.

 On The Way Movie Title Released By Sidhu Jonnalagadda , On The Way Movie Title-TeluguStop.com

సినిమా మొత్తం హైదరాబాద్ రోడ్స్ లో చిత్రీకరించారు.త్వరలో చిత్ర విడుదల తేదీని యూనిట్ ప్రకటించనున్నారు.

ఈ సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ యంగ్ టీమ్ అందరూ కలిసి చేసిన ఆన్ ది వే సినిమా పోస్టర్ టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.సినిమా పెద్ద సక్సెస్ సాధించి చిత్ర యూనిట్ సభ్యులకు మంచి పేరు రావాలని కొరుకుంటున్నాను.

కాన్సెప్ట్ బాగున్న సినిమాలు ఈమధ్య మంచి విజయం సాధిస్తున్నాయి అదే తరహాలో ఈ ‘ఆన్ ది వే’ సినిమా చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి పేరును తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube