సింగపూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

సింగపూర్ చాలా అందమైన దేశం.సింగపూర్ చాలామందికి ఇష్టమైన పర్యాటక ప్రదేశం.

 Some Interesting Things About Singapore , Spitting, Songs Are Sung, Food For Pig-TeluguStop.com

సింగపూర్ ప్ర‌జ‌ల‌కు పరిశుభ్రత పట్ల మక్కువ అధికం.ఇక్క‌డ అనేక‌ చట్టాలు అమలులో ఉన్నాయి.

వాటిని పాటించకపోతే జైలుకు వెళ్లాల్సి వ‌స్తుంది.జరిమానాలు కూడా చెల్లించవలసి వ‌స్తుంది.

మీరు సింగపూర్‌ను సందర్శించబోతున్నట్లయితే, అక్కడి నియమాల గురించి ముందుగా తెలుసుకోండి.సింగపూర్ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉమ్మివేయడంఇక్కడ ఎవ‌రైనా బహిరంగ ప్రదేశంలో ఉమ్మివేస్తే, వారు 1000 డాలర్ల జరిమానా చెల్లించాలి.అలాగే జైలు శిక్ష‌ను ఎదుర్కోవలసి వ‌స్తుంది.
చూయింగ్ గమ్సింగ‌పూర్‌లో చూయింగ్ గమ్ మీద నిషేధం ఉంది.ఎవరైనా చూయింగ్ గమ్ అమ్మితే అతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష, భారీ జరిమానా ఉంటుంది.
చెత్త వేయుడంసింగ‌పూర్‌లో అపరిశుభ్రతను వ్యాపింపజేసే వారు 300 డాల‌ర్ల వరకు జరిమానా చెల్లించవలసి వ‌స్తుంది.జైలు శిక్ష కూడా విధిస్తారు.ఎవరైనా ఇలా పదే పదే చేస్తే వారం రోజుల పాటు వీధులను శుభ్రం చేయాల‌నే శిక్ష విధిస్తారు.
నగ్నంగా తిరిగితేసింగ‌పూర్ లో న‌గ్నంగా ఇంటి చుట్టూ తిరగకూడ‌దు.

ఇలా చేస్తూ ఎవరైనా పట్టుబడితే భారీ జరిమానా చెల్లించాల్సి వ‌స్తుంది.
ధూమపానంఅక్కడ ఇంటిలో మాత్రమే సిగరెట్లు తాగవచ్చు.

బహిరంగ ప్రదేశాలు, వాహనాల్లో మీరు పొగ తాగ‌కూడ‌దు.ప్రయాణ సమయంలో సిగరెట్లను తీసుకెళ్లకూడ‌దు.
ఫ్లష్ చేయక‌పోతేసింగ‌పూర్‌లో టాయిలెట్‌ను ఫ్లష్ చేయకపోతే, మీరు 150 డాల‌ర్ల జరిమానా చెల్లించాలి.
పావురాలకు ఆహారంఅక్కడ పావురాలకు ఆహారం ఇవ్వడం నిషేధం.

ఎవరైనా పావురాలకు ఆహారం ఇస్తూ పట్టుబడితే, వారు 500 డాల‌ర్లు జరిమానాగా చెల్లించాలి.
పాటలు పాడితేసింగ‌పూర్‌లో బహిరంగ ప్రదేశాల్లో పాటలు పాడకూడ‌దు.

ఎవ‌రైనా బహిరంగ ప్రదేశంలో పాట పాడుతున్నట్లు పోలీసులు గ‌మినిస్తే వారికి మూడు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube