ఆర్ఆర్ఆర్ సినిమాకు విడుదలకు ముందు, విడుదల తర్వాత అనేక వివాదాలు చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే.ప్రముఖ రచయిత, దర్శకుడు అల్లాని శ్రీధర్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి, కొమురం భీమ్ పేర్లు పెట్టడం వల్ల తనకు అబ్జెక్షన్ లేదని అయితే ఆ పాత్రలే అని చెప్పడం వల్ల తనకు అబ్జెక్షన్ ఉందని ఆయన వెల్లడించారు.
అల్లూరి, భీమ్ ధ్యేయం ప్రజల తరపున పోరాడటమేనని వీళ్లిద్దరూ అందరి కోసం పోరాటం చేసిన మహా యోధులు అని ఆయన వెల్లడించారు.
వీళ్లిద్దరి కథ ఉంటుందని తాను సినిమాకు వెళ్లానని సినిమాలో ఇద్దరు యోధుల కథ ఉన్నా వాళ్లిద్దరూ అల్లూరి, భీమ్ కాదని ఆయన అన్నారు.అల్లూరి, భీమ్ పాత్రలకు అసలు సంబంధం లేదు వీళ్లు వేరేవాళ్లు అని ఆర్ఆర్ఆర్ మేకర్స్ చెప్పి ఉంటే గొడవే ఉండేది కాదని ఆయన తెలిపారు.
అల్లూరి రియల్ హీరో అని సీతారామరాజు రియల్ లైఫ్ లో ఏదైనా చెప్పి చేశాడని అలాంటి వ్యక్తిని సినిమాలో బ్రిటిష్ యూనిఫామ్ వేసుకున్నాడని చూపించడం అర్థం కాలేదని ఆయన తెలిపారు.భీమ్ ను అల్లూరి చితకబాదడం, భీమ్ ను అల్లూరి విపరీతంగా హింసించడం తనకు డైజెస్ట్ అవ్వలేదని అల్లాని శ్రీధర్ వెల్లడించారు.
భవిష్యత్తులో పిల్లలు సీతారామరాజు బ్రిటిష్ వాళ్ల దగ్గర పని చేశాడని అనుకుంటారని ఆయన వెల్లడించారు.
అడవి మృగాలను ఆయుధాలుగా వాడటం బాలేదని ఆయన చెప్పుకొచ్చారు.అల్లూరి భీమ్ పాత్రలను అలా చూపించకుండా ఉంటే బాగుండేదని ఆయన వెల్లడించారు.అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారని చెప్పడం తప్పు కాదని కానీ ఆ అమ్మాయి అబ్బాయి పౌరాణిక పాత్రలు రాముడు రాధ అయితే తప్పు అవుతుందని ఆయన కామెంట్లు చేశారు.
అల్లాని శ్రీధర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అల్లూరి, భీమ్ పాత్రలకు అన్యాయం జరుగుతోందని అల్లాని శ్రీధర్ పరోక్షంగా చెప్పుకొచ్చారు.